మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 26 ఆగస్టు 2018 (11:55 IST)

ప్రేమ పేరుతో స్వర్గం చూపి.. మరొకర్ని పెళ్లి చేసుకుంటావా...

ప్రేమ పేరుతో శారీరకంగా స్వర్గం చూపించి, ఇపుడుకాదనీ మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంటావా అంటూ ఓ యువతిని రొహింగ్యా శరణార్థి వేధించాడు. ఆ తర్వాత ఆ యువతి పోలీసులను ఆశ్రయించడంతో శరణార్థిన పోలీసులు అరెస్టు చేశా

ప్రేమ పేరుతో శారీరకంగా స్వర్గం చూపించి, ఇపుడుకాదనీ మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంటావా అంటూ ఓ యువతిని రొహింగ్యా శరణార్థి వేధించాడు. ఆ తర్వాత ఆ యువతి పోలీసులను ఆశ్రయించడంతో శరణార్థిన పోలీసులు అరెస్టు చేశారు. ఈ వివరాలను పరిశీలిస్తే...
 
మయన్మార్‌కు చెందిన మహ్మద్‌ అన్వర్‌ (24) బాలాపూర్‌ శరణార్థి శిబిరంలో ఉంటూ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. గతంలో కోవా స్వచ్ఛంద సంస్థలో దుబాసీ (ట్రాన్స్‌లేటర్‌)గా పనిచేశాడు. ఆ సమయంలో అక్కడే పని చేసే మరో మయన్మార్‌ రోహింగ్యా శరణార్థి యువతితో అతడికి పరిచయమైంది. ఇద్దరూ ప్రేమించుకున్నారు. ఈ క్రమంలో సన్నిహితంగా ఉన్నపుడు పలు మార్లు స్వీయ చిత్రాలు (సెల్ఫీలు), వీడియోలు తీసుకున్నాడు. 
 
అయితే, ఈ యువతిని తల్లిదండ్రులు మరో రోహింగ్యా అలీ అక్బర్‌ అనాయత్‌ హుస్సేన్‌కిచ్చి పెళ్లి చేశారు. దీంతో ఓర్వలేని అన్వర్‌ బాధితురాలిపై కక్ష పెంచుకుని ఆమె ప్రతిష్టను భంగం కలిగించాలని, వారి దాంపత్య జీవితాన్ని చెడగొట్టాలని భావించాడు. తాము సన్నిహితంగా ఉన్నప్పుడు తీసుకున్న బాధితురాలి అభ్యంతరకరమైన చిత్రాలను ఆమె భర్తకు వాట్సప్‌ ద్వారా పంపించాడు. దీంతో బాధితురాలు సైబర్‌ క్రైం పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసి అన్వర్‌ను అరెస్టు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.