శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 7 ఆగస్టు 2020 (20:13 IST)

హర్యానా సర్కార్ సంచలన నిర్ణయం... గర్భిణీ స్త్రీలు అక్కడి రాకండి అంటూ..?

హర్యానా సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర సివిల్ సెక్రటేరియట్‌లో పనిచేస్తున్న గర్భిణీ మహిళా ఉద్యోగులను కార్యాలయానికి హాజరుకాకుండా మినహాయించాలని, ఇంటి నుంచి పని చేయడానికి అనుమతించాలని హర్యానా ప్రభుత్వం నిర్ణయించింది. వారు కరోనా బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. 
 
కరోనా వైరస్ ప్రభావం ప్రస్తుతం మహిళలపై చాలా దారుణంగా పడుతుంది. చాలా ప్రాంతాల్లో గర్భిణి మహిళలు ప్రాణాలు ఎక్కువగా కోల్పోతున్నారు. వాళ్లకు వైద్యం చేయడం కూడా కాస్త సవాల్ గానే ఉంది అని చెప్పాలి. దీనిపై ఆందోళన వ్యక్తమవుతుంది. ప్రభుత్వాలు, వైద్య ఆరోగ్య శాఖ ఎన్ని నిర్ణయాలు తీసుకుని అమలు చేయాలి అని చూసినా సరే గర్భిణి స్త్రీలను కొన్ని ప్రాంతాల్లో కాపాడటం సవాల్‌గా మారింది. 
 
అందుకే హర్యానా సర్కారు గర్భిణీ మహిళలను కరోనాకు దూరంగా వుండేలా చర్యలు తీసుకోవాలని అప్రమత్తం చేస్తూ.. గర్భిణీ మహిళలు ఇంటిపట్టునే వుండటం మంచిదని చెప్తోంది. రాష్ట్ర సివిల్ సెక్రటేరియట్‌లో పనిచేస్తున్న గర్భిణీ మహిళా ఉద్యోగులను కార్యాలయానికి హాజరుకాకుండా మినహాయించాలని నిర్ణయించింది.