మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 17 జూన్ 2017 (15:59 IST)

సెల్ఫీ పిచ్చి.. మొసలి నోటిలో తల పెట్టింది.. అదేమో విసిరికొట్టింది.. (వీడియో)

సోషల్ మీడియా ప్రభావం కారణంగా వన్య మృగాలతో సెల్ఫీలు తీసుకోవడం ప్రస్తుతం ఫ్యాషనైపోయింది. పులులు, సింహాలతో కూడా సెల్ఫీలు తీసుకుంటున్న వారున్నారు. అయితే తాజాగా ఓ జూలో పనిచేస్తున్న మొసలి సంరక్షకురాలు.. మొసలి నోటిలో తలను పెట్టి సాహసం చేసింది. అదీ కాస్త బెడ

సోషల్ మీడియా ప్రభావం కారణంగా వన్య మృగాలతో సెల్ఫీలు తీసుకోవడం ప్రస్తుతం ఫ్యాషనైపోయింది. పులులు, సింహాలతో కూడా సెల్ఫీలు తీసుకుంటున్న వారున్నారు. అయితే తాజాగా ఓ జూలో పనిచేస్తున్న మొసలి సంరక్షకురాలు.. మొసలి నోటిలో తలను పెట్టి సాహసం చేసింది. అదీ కాస్త బెడిసికొట్టింది. మొసలి నోటిలో తలను పెట్టి.. జూకొచ్చిన విజిటర్స్‌కు షో చూపించాలనుకుంది. అయితే మొసలికి కోపం వచ్చింది.
 
ఆ సంరక్షకురాలిపై దాడి చేసింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ వీడియోపై నెటిజన్లు విభిన్నాభిప్రాయాలను పోస్ట్ చేస్తున్నారు. క్రూరమృగాల వద్ద చెలగాటం ఆడకూడదని.. అలా ఆడితే మాత్రం ఇలాంటి దాడులు తప్పవని నెటిజన్లు హెచ్చరిస్తున్నారు. ఆ వీడియో మీ కోసం..