ఆదివారం, 10 డిశెంబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 13 మే 2022 (15:37 IST)

కుప్పకూలిన ఫ్లైయింగ్ ప్రాక్టీస్ హెలికాఫ్టర్ - పైలెట్లు దుర్మరణం

Helicopter crashes
ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని రాయ్‌పూర్‌లో స్వామి వివేకానంద విమానాశ్రయంలో గురువారం రాత్రి 9:10 గంటలకు హెలికాప్టర్ కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో అందులోని ఇద్దరు పైలట్లు దుర్మరణంపాలయ్యారు. మరణించిన పైలట్లను కెప్టెన్ గోపాల్ కృష్ణ పాండా, కెప్టెన్ ఏపీ శ్రీవాస్తవగా గుర్తించారు.
 
హెలికాప్టర్‌ను ల్యాండ్ చేసేందుకు పైలట్లు ప్రయత్నించగా హెలికాప్టర్‌లో మంటలు చెలరేగినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. విమానంలో ప్రయాణికులెవరూ లేరని చెబుతున్నారు. రాయ్‌పూర్‌లోని ఎయిర్‌పోర్టులో పైలట్లు ఫ్లైయింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.