శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 25 ఏప్రియల్ 2022 (10:42 IST)

ప్రిన్సిపాల్‌ గంటల పాటు మీటింగ్.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడిన టీచర్

romance
ప్రిన్సిపాల్‌‌తో అదే గదిలో రాసలీలలు కొనసాగించిన టీచర్‌ను గ్రామస్థులు రెడ్ హ్యాండడ్‌గా పట్టుకున్నారు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లో చోటుచేసుకుంది.
 
వివరాల్లోకి వెళితే.. ఛత్తీస్‌గఢ్‌లోని కంకేర్ జిల్లా పరిధిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఓ మహిళ టీచర్‌గా విధులు నిర్వర్తిస్తోంది. రోజూ పిల్లలకు పాఠాలు బోధించాల్సిన ఆమె,చ  కొద్ది రోజుల నుంచి విరుద్ధంగా ప్రవర్తించింది. 
 
ఆ పాఠశాల ప్రిన్సిపాల్ రాజేష్ పాల్‌తో సమావేశం పేరుతో గంటల తరబడి మాట్లాడుతూ ఉండేది. మీటింగ్‌లంటూ ఆయన గదిలో గంటల సేపు గడిపేది. దీంతో అనుమానం వచ్చిన గ్రామస్థులు ఆమెను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.  
 
ఈ సమయంలో కొందరు ఫోన్‌లో వీడియోలు తీశారు. అనూహ్య పరిణామానికి అవాక్కయిన ప్రిన్సిపాల్... వీడియోలు తొలగించేందుకు డబ్బులు ఆశ చూపాడు. 
 
దీనిపై గ్రామస్తులు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన అధికారులు.. ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేశారు. ఈ వార్త స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.