బుధవారం, 1 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 7 ఏప్రియల్ 2022 (09:30 IST)

ఒక్కపూట బడుల సమయాన్ని పెంచిన తెలంగాణ సర్కారు

schools
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. దీంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల్లో ఒక్కపూట బడులు నడుస్తున్నాయి. అయితే, ఈ బడుల సమయాన్ని తొలుత తెలంగాణ ప్రభుత్వం తగ్గించింది. ఈ ఒక్కపూట బడులు ప్రారంభమైనప్పటి నుంచి ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 11.30 గంటల వరకు స్కూల్స్ నడిచాయి. 
 
ఇపుడు మళ్లీ ఈ సమయాన్ని పెంచారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు అంటే గంట సమయాన్ని అదనంగా పెంచారు. ఈ మేరు బుధవారం రాత్రి రాష్ట్ర విద్యా శాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఈ  దీంతో గురువారం నుంచి ఒక్కపూట బడులు మధ్యాహ్నం 12.30 గంటల వరకు కొనసాగనున్నాయి.