శుక్రవారం, 20 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 13 జులై 2017 (11:10 IST)

గుర్రంపై ఊరేగిన వరుడు ఒక్కసారిగా బావిలో పడిపోయాడు (video)

పెళ్లి వేడుకలో అపశృతి చోటుచేసుకుంది. అప్పటిదాకా ఎంతో హ్యాపీగా గుర్రంపై ఊరేగిన వరుడు ఒక్కసారిగా బావిలో పడిపోయాడు. దీంతో బంధువులంతా తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని గొండాలో చోటుచేసుకుంద

పెళ్లి వేడుకలో అపశృతి చోటుచేసుకుంది. అప్పటిదాకా ఎంతో హ్యాపీగా గుర్రంపై ఊరేగిన వరుడు ఒక్కసారిగా బావిలో పడిపోయాడు. దీంతో బంధువులంతా తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని గొండాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. వరుడిని ఊరేగింపుగా గుర్రంపై తీసుకెళుతున్న సమయంలో దురదృష్టవశాత్తు గుర్రంతో పాటు పెళ్లికొడుకు కూడా పక్కనున్న బావిలో పడిపోయాడు. దీంతో, పెళ్లికొడుకుకు ఏమౌతుందోనని భయపడ్డారు. 
 
రెస్క్యూ టీమ్ రాగానే జేసీబీ సహాయంతో పెళ్లికొడుకును, గుర్రాన్ని బయటకు తీశారు. బావి లోతు ఎక్కువగా లేకపోవడంతో ప్రమాదం తప్పింది. బావి నుంచి బయటకు తీసిన తర్వాత వరుడిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదం నుంచి వరుడు, గుర్రం తప్పించుకోవడంతో పెళ్లికి వచ్చిన వారంతా ఊపిరి పీల్చుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.