శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 16 జులై 2020 (06:55 IST)

తమిళనాడు సరిహద్దుల్లో భారీగా డబ్బు, బంగారం పట్టివేత... ఏపీ మంత్రిదంటూ ప్రచారం?

తమిళనాడులోని తిరువళ్లూరు సమీపం సరిహద్దుల్లో... ఓ వాహనంలో భారీగా నగదు, బంగారాన్ని పోలీసులు గుర్తించారు. ఆ వాహనం ఏపీకి చెందిన ఓ మంత్రిది అని ప్రచారం జరుగుతోంది.

ఆ వాహనంలో ఎలాంటి అనుమతి లేకుండా ముగ్గురు వ్యక్తులు సరిహద్దులు దాటి రాష్ట్రంలోకి రావడంతో తమిళనాడు పోలీసులు తనిఖీచేశారు.

అరంబాక్కం సమీపంలోని ఎలాపూర్‌ చెక్ పోస్ట్ వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించగా వాహనంలో కోటి రూపాయల నగదు, భారీగా బంగారం గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.

నిందితుల్లో ఒంగోలుకు చెందిన ఇద్దరు, చిలకలూరిపేటకు చెందిన ఒకరు ఉన్నారు. వాళ్లు ఎవరు? ఎక్కడి నుంచి వస్తున్నారు? డబ్బు, బంగారాన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు? అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.