శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 23 జూన్ 2020 (09:50 IST)

పెరుగుతున్న బంగారం ధర

లాక్ డౌన్ ప్రభావంతో సంబంధం లేకుండా బంగారం ధర పరుగు పెడుతూనే వుంది. పసిడి సరికొత్త రికార్డు స్థాయిని నమోదు చేసింది. సోమవారం హైదరాబాద్‌ బులియన్‌ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.50,580కి చేరుకుంది. 22 క్యారెట్ల గోల్డ్‌ పది గ్రాముల రేటు రూ.46,290 పలికింది.

వెండిదీ అదే బాట. కేజీ సిల్వర్‌ రూ.48,800కి ఎగబాకింది. ముంబై బులియన్‌ మార్కెట్లో 10 గ్రాముల బంగారం (99.9 శాతం స్వచ్ఛత) రూ.48,130 పలుకగా.. కేజీ వెండి ధర రూ.48,825కి చేరుకుంది. అంతర్జాతీయంగా విలువైన లోహాలకు డిమాండ్‌ పుంజుకోవడం ఇందుకు కారణమైంది.
 
భారత కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 11 గంటలకు అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్‌ (31.10 గ్రాములు) బంగారం 1,767 డాలర్లు, వెండి 18 డాలర్ల ఎగువన ట్రేడవుతోంది.

ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు ఉధృతమవుతుండటంతో పాటు ఆర్థిక పునరుద్ధరణ చాలా కాలం పట్టవచ్చని అమెరికా ఫెడ్‌ రిజర్వ్‌ ఉన్నతాధికారి ఒకరు ఆందోళన వ్యక్తం చేయడంతో విలువైన లోహాలకు డిమాండ్‌ పెరిగింది.