గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 21 సెప్టెంబరు 2022 (17:03 IST)

హైదరాబాద్ నగరం సురక్షితమా? దేశంలో దాని స్థానమెంత?

charminar
భాగ్యనగరం ఎన్నో అంశాలల్లో ప్రత్యేకత చాటుకుంది. తాజాగా మరో ఘనత సాధించింది. దేశంలోని ప్రధాన నగరాల్లో సురక్షిత నగరాల జాబితాలో చోటుదక్కించుకుంది. ఈ జాబితాలో వెస్ట్ బెంగాల్ రాజధాని కోల్‌కతా మొదటి స్థానంలో నిలువగా తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరం మూడో స్థానంలో నిలిచింది. ఈ విషయాన్ని జాతీయ నేర నమోదు విభాగం (ఎన్.సి.ఆర్.బి) వెల్లడించింది. రెండో స్థానంలో పూణె నగరం నిలిచింది. 
 
నేషనల్ క్రైమ్ రికార్డు బ్యూరో ప్రకారం హైదరాబాద్ నగరంలో 2021లో 10 లక్షల మంది ప్రజలకుగాను 2,599 నేరాలు జరిగినట్టు తేలింది. కోల్‌కతా నగరంలో 1,034 నేరాలు నమోదైనట్టు తెలిపింది. పూణెలో 2,568 నేరాలు జరిగాయని తెలిపింది. ఇదేకాలంలో దేశ రాజధాని ఢిల్లీలో 18,596 నేరాలు నమోదయ్యాయి. 
 
కాగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి 13 జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్రం గత 2014లో వేరుపడింది. ఈ రాష్ట్రం ఏర్పడిన కేవలం ఎనిమిదేళ్లలోనే దేశంలోని సురక్షిత నగరాల జాబితాలో చోటుచేసుకోవడం గమనార్హం. దీంతో ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెరిగే అవకాశం ఉంది.