సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 5 డిశెంబరు 2019 (12:26 IST)

భారత వాయుసేన అధిపతి జస్ట్ ఎస్కేప్...?!

ఇటీవల అమెరికాలో కాల్పులు జరుగగా, పలువురు చనిపోయారు. ఈ కాల్పుల్లో భారత వాయుసేన అధిపతి ఆర్కేఎస్ భదౌరియా తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. బుధ‌వారం రోజున అమెరికాలోని హ‌వాయి రాష్ట్రంలో ఉన్న పెర‌ల్ హార్బ‌ర్‌లో కాల్పులు జరిగాయి. 
 
పెర‌ల్ హార్బ‌ర్ హిక్క‌మ్‌ జాయింట్ బేస్ వ‌ద్ద కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ప‌లువురు గాయ‌ప‌డ్డారు. అయితే ఆ ఘ‌ట‌న స‌మ‌యంలో ఐఏఎఫ్ చీఫ్ ఆర్కేఎస్‌తో భ‌దౌరియాతో పాటు ఐఏఎఫ్ బృందం అక్క‌డే ఉన్న‌ది. కానీ భార‌తీయ వాయుద‌ళానికి ఎటువంటి ప్రాణ న‌ష్టం జ‌ర‌గ‌లేద‌ని భార‌త వాయుసేన స్ప‌ష్టం చేసింది. 
 
ఎయిర్ చీఫ్‌తో పాటు అక్క‌డ‌కు వెళ్లిన భార‌తీయ‌ సిబ్బందికి ఏమీకాలేద‌ని తెలిపింది. కాల్పుల్లో ఒక‌రు మృతి చెందారు. యూఎస్ సెయిల‌ర్ ఈ దాడికి పాల్ప‌డిన‌ట్లు గుర్తించారు. ఇండో ప‌సిఫిక్ ప్రాంతంలో భ‌ద్ర‌త అంశంపై పలు దేశాల ఎయిర్ చీఫ్‌లతో జ‌రుగుతున్న స‌మావేశంలో పాల్గొనేందుకు భ‌దౌరియా అమెరికా వెళ్లిన విషయం తెల్సిందే. 
 
కాగా, అమెరికా నౌకాద‌ళ సైన్యానికి పెర‌ల్ హార్బ‌ర్ కేంద్రంగా ఉంది. ఇక్క‌డ భారీ నౌక‌ల‌కు రిపేర్‌, మెయింటేన్ చేస్తారు. వాటిని ఆధునీక‌రిస్తారు. పెర‌ల్ హార్బ‌ర్‌లోనే సుమారు 10 డెస్ట్రాయ‌ర్లు, 15 స‌బ్‌మెరైన్లు కూడా ఉన్నాయి. రెండో ప్ర‌పంచ యుద్ధంలో జ‌పాన్ దాడి చేసింది ఈ నాకౌశ్ర‌యంపైనే. ఈ శ‌నివారం ఆ దాడికి 78 ఏళ్ల పూర్తయ్యాయి. ఈ స్థావరాన్ని లక్ష్యంగా చేసుకునే కాల్పులు జరిగాయి.