గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 5 డిశెంబరు 2019 (11:18 IST)

యూపీలో మరో దిశ ఘటన : రేప్ చేసి పెట్రోల్ పోసి నిప్పంటించారు...

హైదరాబాద్ నగరంలో జరిగిన దిశ అత్యాచార, హత్య ఘటన దేశాన్ని కుదిపేస్తోంది. ఈ ఘటనను మరచిపోకముందే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఇదే తరహా మరో ఘటన జరిగింది. ఓ యువతిపై అత్యాచారం జరిపి, పెట్రోల్ పోసి నిప్పంటించారు. దీంతో బాధిత యువతి 90 శాతం మేరకు కాలిన గాయాలతో చావుబతుకుల మధ్య పోరాడుతోంది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, రాష్ట్రంలోని ఉన్నావోలో ఓ యువతిపై ఐదుగురు కామాంధులు సామూహిక అత్యాచారం జరిపారు. ఆ తర్వాత ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఈ ఘటనలో బాధితురాలు 90 శాతం గాయాలతో లక్నోలోని ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ దారుణానికి పాల్పడిన నిందితుల్లో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకోగా, మరో ఇద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. 
 
నిజానికి ఈ అత్యాచారం చాలా రోజుల క్రితమే జరిగింది. అయితే, కామాంధులపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు పెట్టింది. దీంతో ఆమెపై హత్యాయత్నం చేశారు. యువతి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు వెల్లడించారు.