తూగో జిల్లాలో 50 యేళ్ళ మహిళపై గ్యాంగ్ రేప్!

ఠాగూర్| Last Updated: బుధవారం, 4 డిశెంబరు 2019 (14:13 IST)
నవ్యాంధ్రలోని తూర్పుగోదావరి జిల్లాలో 50 ఏళ్ళ మహిళపై సామూహిక అత్యాచారం, హత్య జరిగింది. ముగ్గురు వ్యక్తులు అత్యంత కిరాతకంగా అత్యాచారానికి పాల్పడి హతమార్చిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.

ఈ వివరాలను పరిశీలిస్తే, తూర్పు గోదావరి జిల్లాలోని జి. వేమవరంలో ఓ వివాహిత తన ఇంట్లో ఒంటరిగా నివశిస్తోంది. ఈమె భర్త కుమారుడు మరణించగా, కుమార్తె హైదరాబాద్ నగరంలో నివసిస్తోంది. దీంతో ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

ముగ్గురు నిందితుల్లో ఒకరిని ఇప్పటికే పోలీసులు అరెస్టు చేయగా, మరో ఇద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ కేసును సవాల్‌గా తీసుకున్న జిల్లా పోలీసులు.. దోషులకు కఠిన శిక్ష పడేలా చేస్తామని చెప్తున్నారు.

షాద్ నగర్ దిశా ఘటన మరువకముందే మరో ఘటన
నిన్నటికి నిన్న షాద్ నగర్ సమీపంలో వెటర్నరీ డాక్టర్ దిశను సామూహిక అత్యాచారం చేసి హతమార్చిన నేరస్తులపై దేశం భగ్గుమంటుంది. ఉరి తీయాలని డిమాండ్ చేస్తుంది. అలాంటి వారిని ప్రాణాలతో ఉంచితే సమాజానికి ప్రమాదకరంగా పరిణమిస్తారని మహిళా లోకం ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఈ ఘటన జరిగి పట్టుమని 10 రోజులు కాకముందే మరో ఘటన తెలుగు రాష్ట్రంలో చోటుచేసుకుంది.దీనిపై మరింత చదవండి :