కాస్త బరువు పెరిగినా మీరు గర్భవతా? అంటారు.. శరీరాకృతిపై ఏంటీ డర్టీ కామెంట్స్!
టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జాకు ఎదురైన అవమానాలను ఆమె తాజాగా వెల్లడించారు. ముఖ్యంగా, గర్భవతిగా ఉన్న సమయంలో పలు రకాలైన కామెంట్స్ ఎదుర్కొన్నట్టు చెప్పుకొచ్చింది. పైగా, కాస్త బరువు పెరిగినా మీరు గర్భవతా అంటూ ప్రశ్నిస్తారనీ, ఒక వ్యక్తి శరీరాకృతిపై డర్టీ కామెంట్స్ ఏంటని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.
సానియా మీర్జా తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందిస్తూ, తాను గర్భవతిగా ఉన్నప్పుడు అనేక అవమానాలు ఎదురయ్యాయని వెల్లడించింది. సోషల్ మీడియాలో వ్యక్తి శరీరాకృతిపై అవమానకరంగా కామెంట్లు చేస్తారని తెలిపింది. ఒక మహిళ కాస్త బరువు పెరిగినా, వెంటనే మీరు గర్భవతా? అని అడుగుతారని ఆవేదన వ్యక్తం చేసింది.
సెలబ్రిటీలుగా తాము సౌకర్యవంతంగా ఉండాల్సి ఉంటుందని, తాను గతంలో గర్భవతిగా ఉన్న ఫొటో సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశానని, దాని వల్ల కూడా తనకు అవమానాలు ఎదురయ్యాయని సానియా చెప్పుకొచ్చింది. ఇకపై తాను వారి నోర్లు మూయించాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. కాగా, ప్రస్తుతం సానియా మీర్జా ఓ బిడ్డకు తల్లిగా ఉన్న విషయం తెల్సిందే.