మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 28 నవంబరు 2019 (10:25 IST)

ట్రిపుల్ తలాక్‌ను నిరాకరించిన కోడలిపై మామ అత్యాచారం..

ట్రిపుల్ తలాక్‌ను నిరాకరించినందుకు కోడలిపై మామ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన రాజస్థాన్‌లోని భివాడిలో దారుణం జరిగింది. అతనితో పాటు మరో బంధువు కూడా ఆమెపై అత్యాచారం చేశాడు. ఈ ఘటనపై పోలీసులను ఆశ్రయించడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. 
 
భర్త చెప్పిన ట్రిపుల్ తలాక్‌ని నిరాకరించినందుకు మొదట ఆమెపై దాడికి పాల్పడ్డారని.. అనంతరం ఆమె మామ, మరో బంధువు అత్యాచారం చేశారని పోలీసులు తెలిపారు. ఆమె భర్త, మామ, బంధువుపై కేసు నమోదు చేసినట్టు తెలిపారు. ఇదే పోలీస్ స్టేషన్‌లో మరో ట్రిపుల్ తలాక్ కేసు కూడా నమోదైంది.
 
నవంబర్ 17న తన భర్త ఫోన్‌లో ట్రిపుల్ తలాక్ చెప్పాడని ఆరోపిస్తూ ఓ వివాహిత పోలీసులను ఆశ్రయించింది. అత్తమామలు కూడా విడాకులకు తనపై ఒత్తిడి తెస్తున్నారని పేర్కొంది.దీంతో భర్తతో పాటు అతని తల్లిదండ్రులపై పోలీసులు కేసు నమోదు చేశారు.