శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 18 ఏప్రియల్ 2020 (20:22 IST)

భారత్‌లో 14,378 కరోనా కేసులు

భారత్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. గడచిన 24 గంటల్లో 991 కొత్త కేసులు నమోదు కాగా, 43 మంది మరణించారని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.

కరోనా నుంచి ఇప్పటి వరకు 1992 మంది కోలుకున్నారు. మహమ్మారి బారిన పడి ఇప్పటి వరకు మృతిచెందిన వారి సంఖ్య 480కి చేరింది. దేశంలో శనివారం మధ్యాహ్నం వరకు 14,378 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

''దేశవ్యాప్తంగా కొన్నిజిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు. దేశవ్యాప్తంగా 11 జిల్లాల్లో 2 వారాలుగా కొత్త కేసులు నమోదు కాలేదు. కరోనా బాధితుల్లో మరణాల రేటు 3.3శాతం మాత్రమే. మృతుల్లో 14శాతం 45 ఏళ్లు పైబడిన వారు. 70శాతానికి పైగా మరణాలు 70ఏళ్లు పైబడిన వారే.

భౌతిక‌ దూరం అమలు విషయంలో రాష్ట్రాలు ఎక్కువ బాధ్యత వహించాలి. హాట్‌స్పాట్‌ ప్రాంతాల్లోని వారికి ర్యాపిడ్‌ టెస్టులు ఎక్కువ సంఖ్యలో చేయాలని'' కేంద్రం పేర్కొంది.