శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : ఆదివారం, 3 జూన్ 2018 (14:06 IST)

ఒడిశా తీరంలో అగ్ని-5 బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం... సక్సెస్ అయ్యిందోచ్..

ఒడిశా తీరంలోని డాక్టర్ అబ్ధుల్ కలాం ఐలాండ్‌లో ఆదివారం (జూన్ మూడో తేదీ) నావిగేషన్‌, వార్‌ హెడ్లను మోసుకెళ్లే సామర్థ్యం ఉన్న అగ్ని-5 క్షిపణి ప్రయోగం విజయవంతమైనట్లు రక్షణశాఖ ప్రకటించింది. కలాం ఐలాండ్‌‌లో

ఒడిశా తీరంలోని డాక్టర్ అబ్ధుల్ కలాం ఐలాండ్‌లో ఆదివారం (జూన్ మూడో తేదీ) నావిగేషన్‌, వార్‌ హెడ్లను మోసుకెళ్లే సామర్థ్యం ఉన్న అగ్ని-5 క్షిపణి ప్రయోగం విజయవంతమైనట్లు రక్షణశాఖ ప్రకటించింది.

కలాం ఐలాండ్‌‌లో ఇంటిగ్రేటెడ్‌ టెస్ట్‌ రేంజ్ ‌(ఐటీఆర్) నుంచి ఈ క్షిపణిని ప్రయోగించారు. రాడార్లు, ట్రాకింగ్‌ వ్యవస్థలతో పరిశీలించిన అధికారులు క్షిపణి నిర్ణీత దూరం చేరుకుందని, ప్రయోగం విజయవంతమైందని వెల్లడించారు. 
 
ఆరోసారి అగ్ని-5 క్షిపణి ప్రయోగం విజయవంతమైనట్లు అధికారులు తెలిపారు. ఈ క్షిపణి ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే సామర్థ్యం కలిగివుంటుంది. ఇంకా ఐదు వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదిస్తోంది. రాడార్లు, ట్రాకింగ్ వ్యవస్థలు, క్షిపణి పనితీరును పరిశీలించామని, క్షిపణి దానికి నిర్దేశించిన పూర్తి దూరాన్ని కచ్చితత్వంతో చేరుకుందని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. దీంతో ప్రయోగం భారీ విజయం సాధించిందని హర్షం వ్యక్తం చేశారు.