బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 27 మే 2018 (14:58 IST)

రూ.9 కోట్ల జాక్‌పాట్... టాక్సీ డ్రైవర్‌ను పెళ్లాడిన ముంబై మోడల్

ముంబైకు చెందిన ఓ మోడల్ టాక్సీ డ్రైవర్‌ను పెళ్ళి చేసుకుంది. దీంతో ఆ డ్రైవర్‌కు జాక్‌పాట్ తగిలింది. ఈ వివరాలను పరిశీలిస్తే, ముంబైకు చెందిన విహాన్ పటేల్ (27) ఓ బ్రహ్మచారి. జీవనోపాధి కోసం ట్యాక్సీ డ్రైవర్

ముంబైకు చెందిన ఓ మోడల్ టాక్సీ డ్రైవర్‌ను పెళ్ళి చేసుకుంది. దీంతో ఆ డ్రైవర్‌కు జాక్‌పాట్ తగిలింది. ఈ వివరాలను పరిశీలిస్తే, ముంబైకు చెందిన విహాన్ పటేల్ (27) ఓ బ్రహ్మచారి. జీవనోపాధి కోసం ట్యాక్సీ డ్రైవర్‌గా మారాడు. ఎత్తు 56 అడుగులు. వయసు మీదపడటంతో పెళ్ళి చేసుకోవాలని తల్లిదండ్రులు, బంధువులు ఒత్తిడి తెచ్చారు. అయినప్పటికీ ససేమిరా అన్నాడు. పైగా, స్థిరమైన ఉపాధి లేకపోవడంతో అతన్ని పెళ్లి చేసుకునేందుకు ఏ అమ్మాయి ముందుకు రాలేదు.
 
కానీ, ఉన్నట్టుండి ఓ రోజు కాలం అతడ్ని హీరోను చేసేసింది. గ్రాండ్ మోండియల్ క్యాసినోలో అతడు ఆడిన ఆట 9,43,49,014 రూపాయల ప్రైజ్‌కు విజేతను చేసింది. అంతే మరుసటి రోజే అతడి బ్యాంకు ఖాతాలో ఆ మొత్తం జమ అయింది. ఈ విషయం మీడియా కథనాల ద్వారా ముంబైకి చెందిన 23 ఏళ్ల మిరా ఖాత్రి అనే మోడల్ చెవిన పడింది. 
 
అదృష్టవంతుడిని పెళ్లాడాలని నిర్ణయించుకున్న ఆమె విహాన్ ఇంటి ముందు వాలిపోయింది. అంద అందగత్తె వచ్చి పెళ్లి చేసుకుంటానంటే ఎవరైనా కాదనుకుంటారా...? విహాన్, అతని తల్లిదండ్రులు ఓకే చెప్పడం, వారి పెళ్లి జరిగిపోవడం అయిపోయింది.