ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 20 జులై 2023 (12:37 IST)

రాజస్థాన్‌లో ఘోరం.. ఇంటిని తగలబెట్టారు... నలుగురు మృతి.. ఆరు నెలల పసికందు కూడా ..

fire
దేశంలో నేరాలు పెరిగిపోతున్నాయి. రాజస్థాన్‌లో ఘోరం జరిగింది. గుర్తు తెలియని అగంతకులు ఒకే కుటుంబానికి చెందిన నలుగురిని దారుణంగా హత్య చేశారు. అనంతరం మృతదేహాలను వారి ఇంట్లోనే ఉంచి ఇల్లు మొత్తం తగలబెట్టారు. మృతుల్లో ఆరు నెలల పసికందు కూడా ఉంది. ఆ దారుణ ఘటన రాజస్థాన్‌ సీఎం అశోక్ గెహ్లాట్ సొంత జిల్లాలో చోటుచేసుకోవడంతో రాజకీయంగా తీవ్రదుమారం లేపింది. 
 
ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రతిపక్ష బీజేపీ వర్గాలు ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ దారుణ సంఘటన మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. 
 
ఇంటి నుంచి పొగలు వస్తుండటంతో స్థానికులు పోలీసులకి సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు గుర్తుపట్టలేనంతగా కాలిపోయి నలుగురి మృతదేహాలను వెలికితీశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని వివిధ కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నారు.