మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 23 జనవరి 2023 (13:12 IST)

హిందూ మహాసముద్రంలో చైనాకు చెక్... జలప్రవేశం చేసిన ఐఎన్ఎస్ వగీర్

ins vagir
హిందూ మహాసముద్ర జలాల్లో చైనా ఆధిపత్యానికి చెక్ పెట్టేందుకు భారత్ తన వంతుగా కృషి చేస్తుంది. ఇందులోభాగంగా ఐఎన్ఎస్ వగీర్‌ జలాంతర్గామిని జలప్రవేశం చేశారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో స్వదేశంగా ఈ జలాంతర్గామిని తయారు చేశారు. దీన్ని ముంబైలోని కల్వరి క్లాస్‌లో జలప్రవేశం చేసిన ఐదో జలాంతర్గామి కావడం గమనార్హం. నిశ్శబ్దంగా ప్రయాణించే ఈ జలాంతర్గామితో భారత నౌకాదళం సామర్థ్యం మరింతగా బలోపేతంకానుంది.
 
ఫ్రాన్స్ నుంచి అందిపుచ్చుకున్న సాంకేతిక పరిజ్ఞానంతో ముంబైలోని మజాగాన్ డాక్ షిప్‍బిల్డర్ లిమిటెడ్‌ నిర్మించిన ఐఎన్ఎస్ వాగిర్‌ను నావల్‌ స్టాప్ చీఫ్ అడ్మిరల్ ఆర్.హరికుమార్ ప్రారంభించారు. ఇది సముద్ర జలాల్లో శత్రువుల కదలికలను పసిగట్టడంతో పాటు దేశ సముద్ర ప్రయోజనాలను మరింతగా పెంచడానికి ఉపయోగపడుతుంది. యుద్ధ సమయాల్లో శత్రు యుద్ధ నౌకలను పసిగట్టిని వాటిని నిర్వీర్యం చేసే సామర్థ్యం దీని సొంతమని భారత నౌకాదళం పేర్కొంది.
 
వగీర్ అంటే ఇసుకు సొరచేప. ఐఎన్ఎస్ వగీర్‌లో ప్రపంచంలోని అత్యుత్తమ సెన్సార్‌లు ఉన్నాయి. వగీర్ ఆయుధ ప్యాకేజీలో తగినం వైర్ గైడెడ్ డార్పెడోలు, పెద్ద శత్రు నౌకాదళాన్ని దెబ్బకొట్టేందుకు తగినన్ని ఉపరితల క్షిపణలు, ఉప-ఉపరితలం ఉన్నాయి. ఈ జలాంతర్గామి ప్రత్యేక కార్యకలాపాల కోసం మెరైన్ కమాండోలను కూడా ప్రారంభించగలదు. హిందూ మహా సముద్రంలో చైనా నావికాదళం ఉనికిని పెంచుతున్న నేపథ్యంలో ఐఎన్ఎస్ వగీర్‌ను ప్రారంభించడం సంతరించుకుంది.