పాదగయ క్షేత్రం ప్రసాదంలో పురుగులు.. పవన్ కల్యాణ్ ఇలాకాలో ఇలానా? (video)
పిఠాపురంలో కొలువైన పదో శక్తి పీఠం పాదగయ క్షేత్రంలో కుక్కుటేశ్వర స్వామి ఆలయంలో భక్తులకు షాకిచ్చే ఘటన చోటుచేసుకుంది. కుక్కుటేశ్వర స్వామి ఆలయంలో సోమవారం ధనుర్మాసం ప్రారంభం కావడంతో పాటుగా శివుడి జన్మ నక్షత్రమైన ఆరుద్ర నక్షత్రం కావడంతో ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు.
ఈ క్రమంలో భక్తులు స్వామివారిని దర్శించుకున్న అనంతరం ప్రసాదం కోసం వచ్చారు. అయితే ఆలయంలో భక్తులకు అందించే పులిహోరలో పురుగులు ప్రత్యక్షం అయ్యాయి.
అయితే ఆలయంలో నాణ్యత లేని సరుకులతో ప్రసాదం తయారు చేస్తున్నారని కొందరు భక్తులు ఆరోపించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలోని ఆలయంలో ఇలా జరగడం చర్చనీయాంశమైంది.