ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 21 జులై 2023 (09:36 IST)

జైపూర్‌ను వణికించిన భూకంపాలు..

earthquake
జైపూర్‌ను భూకంపాలు వణికించాయి. ఈ తెల్లవారుజామున 4 గంటల నుంచి వరుసగా భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై వీటి తీవ్రత 3.1 నుంచి 4.22 మధ్య ఉంది. భూకంప కేంద్రం భూఉపరితలానికి 10 కిలోమీటర్ల లోతున ఉన్నట్టు అధికారులు చెప్పారు
 
మంచి నిద్రలో ఉన్నప్పుడు భూప్రకంపనలు రావడంతో ప్రజలు ఏం జరుగుతోందో తెలియక ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. అయితే, ఈ భూకంపాల వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని తెలుస్తోంది.