మంగళవారం, 5 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 13 జూన్ 2023 (18:04 IST)

ఢిల్లీ సహా ఉత్తరాది రాష్ట్రాలను వణికించిన భూకంపం

earth quake
ఉత్తర భారతదేశాన్ని భూప్రకంపనలు వణికించాయి. దేశ రాజధానితో సహా పంజాబ్, జమ్మూకాశ్మీర్, రాష్ట్రాల్లో మంగళవారం మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. వీటి ప్రభావం రిక్టర్ స్కేలుపై 5.4గా నమోదైనట్టు అధికారులు తెలిపారు. 
 
జమ్మూకాశ్మీరులోని దోడా జిల్లా గందో భలేసా గ్రామానికి 18 కిలోమీటర్ల దూరంలో 30 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రం ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. ఈ ప్రభావంతో ఢిల్లీ, పంజాబ్ సహా ఉత్తరాది ప్రాంతాల్లో భూప్రకంపనలు సంభవించాయి.
 
రాజధానిలో కొన్ని సెకన్ల పాటు భూమి కనిపించింది. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఇళ్ళలో నుంచి ఒక్కసారిగా ఇళ్లలో నుంచి పరుగులు తీశారు. ఈ భూప్రకంపనల ప్రభావం పాకిస్థాన్ రాష్ట్రంలోని లాహోర్‌లో కూడా కనిపించాయి.