ఆదివారం, 26 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 26 డిశెంబరు 2020 (10:01 IST)

మహిళా సహ ఉద్యోగినిని వేధిస్తున్నారని.. జర్నలిస్టుపై దాడి.. మృతి

మహిళా సహ ఉద్యోగినిని వేధిస్తున్నారని ప్రతిఘటించిన జర్నలిస్టుపై ఆగంతకులు దాడి చేసిన ఘటన రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్ నగరంలో చోటుచేసుకుంది. తోటి మహిళా ఉద్యోగినితో కలిసి జర్నలిస్టు రాత్రి 11.30 గంటలకు దాబాకు వచ్చారు. మోటారుసైకిళ్లపై వచ్చిన ముగ్గురు వ్యక్తులు మహిళా జర్నలిస్టును వేధించారు. దీంతో అభిషేక్ సోని అనే జర్నలిస్టు ప్రతిఘటించారు.
 
దీంతో ముగ్గురు ఆగంతకులు జర్నలిస్టు అభిషేక్ సోనిపై దాడి చేశారు. ఈ దాడిలో జర్నలిస్టు తలకు తీవ్ర గాయమైంది. గాయపడిన జర్నలిస్టు చికిత్స పొందుతూ మరణించారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దాడి చేసిన నిందితులను గుర్తించి పట్టుకుంటామని పోలీసులు చెప్పారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.