మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 4 నవంబరు 2020 (08:29 IST)

లైంగిక వేధింపుల కేసులో నటుడు అరెస్టు!

తనను లైంగికంగా వేధించారంటూ ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో నటుడు విజయ్ రాజ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని బాలాఘాట్, గోండియాలోని హోటల్ గేట్ వే‌ లో ఓ చిత్రం షూటింగు సందర్భంగా విజయ్ రాజ్ తనపై లైంగికదాడి చేశారంటూ ఆ మహిళ ఫిర్యాదు ఇచ్చింది. 
 
దీంతో పోలీసులు నటుడు విజయ్ రాజ్‌ను అరెస్టు చేసి గోండియాలోని స్థానిక కోర్టులో హాజరుపర్చగా కోర్టు జడ్జి ఆయనకు బెయిలు మంజూరు చేశారు. విజయరాజ్ ఇతర యూనిట్ సభ్యులతో కలిసి గోండియాలో "షెర్ని" చిత్రం షూటింగు జరుగుతుండగా ఈ లైంగికవేధింపుల ఘటన చోటుచేసుకుంది. 
 
కాగా, చిత్ర యూనిట్‌లో పనిచేస్తున్న 30 ఏళ్ల మహిళ తనను విజయ్ రాజ్ లైంగికంగా వేధించాడని ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు విజయ్ రాజ్‌పై ఐపీసీ సెక్షన్ 354 ఎ, డి సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. 
 
విజయ్ రాజ్ 1999లో విడుదలైన 'భోపాల్ ఎక్స్‌ప్రెస్'లో తొలిసారిగా నటించారు. 'జంగిల్', 'మాన్‌సూన్ వెడ్డింగ్', 'ఆక్సు', 'కంపెనీ', 'లాల్ సలాం', 'రోడ్', 'రన్', 'ధమాల్', 'డ్రీమ్ గర్ల్', 'గల్లీ బాయ్' వంటి సినిమాల్లో ఈయన నటించారు. వెబ్ సిరీస్‌లో నటించాడు. అతను చివరిసారిగా 'గులాబో సీతాబో' సినిమాలో కనిపించారు. ప్రస్తుతం ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో చిక్కుల్లో పడ్డారు.