బుధవారం, 15 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 20 డిశెంబరు 2017 (18:47 IST)

జయలలిత మృతిపై మళ్లీ రసవత్తర చర్చ...

జయలలిత ఆసుపత్రిలో ఎలా ఉన్నారు? అపస్మారకస్థితిలో వెళ్లారా? అక్కడ ఆమెకు అసలు చికిత్స జరిగిందా? లేదా? ఇలా అనేక ధర్మ సందేహాలు దేశ ప్రజలందరికీ ఉన్నాయి. అయితే, తాజాగా ఆమె ఆసుపత్రిలో ఎలా ఉన్నారనే అంశానికి సం

జయలలిత ఆసుపత్రిలో ఎలా ఉన్నారు? అపస్మారకస్థితిలో వెళ్లారా? అక్కడ ఆమెకు అసలు చికిత్స జరిగిందా? లేదా? ఇలా అనేక ధర్మ సందేహాలు దేశ ప్రజలందరికీ ఉన్నాయి. అయితే, తాజాగా ఆమె ఆసుపత్రిలో ఎలా ఉన్నారనే అంశానికి సంబంధించిన వీడియోను టీటీవీ దినకరన్ వర్గానికి చెందిన చెన్నై పెరంబూర్ ఎమ్మెల్యే పి.వెట్రివేల్ రిలీజ్ చేశారు.

జయలలిత ప్రాతినిథ్యం వహిస్తూ వచ్చిన ఆర్.కే.నగర్ అసెంబ్లీ స్థానానికి గురువారం ఉప ఎన్నిక పోలింగ్ జరుగనుంది. ఈ పోలింగ్‌కు ఒక్క రోజు ముందు ఈ వీడియోను రిలీజ్ చేయడం ఇపుడు సర్వత్రా చర్చ సాగుతోంది. 
 
తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్న జయలలిత చెన్నై అపోలో ఆస్పత్రిలో దాదాపు 75 రోజుల పోటు చికిత్స పొంది, గత 2015 డిసెంబర్ ఐదో తేదీ రాత్రి 11 గంటల సమయంలో కన్నుమూశారు. ఆమె మరణం ఓ మిస్టరీగా మారిపోయింది. ఈ మృతిపై రకరకాలా వ్యాఖ్యానాలు వచ్చాయి. ఆమె ఆసుపత్రిలో ఉన్నంత వరకూ కనీసం ఒక్క ఫోటో కూడా విడుదల కాలేదు. 
 
ఇలాంటి పరిస్థితులలో పళని స్వామి, పన్నీర్ సెల్వం వర్గాలు శశికళపై అనేక ఆరోపణలు చేశారు. శశికళ వర్గం జయలలితను నిర్లక్ష్యం చేసి చనిపోవడానికి కారణమయ్యారంటూ ఆరోపించారు. దీనికితోడు జయలలిత అపస్మారక స్థితిలోనే తమ ఆస్పత్రికి తీసుకొచ్చారంటూ అపోలో ఆస్పత్రి గ్రూపు సంస్థల వైస్ ఛైర్మన్ ప్రీతారెడ్డి ప్రకటించగా, దాన్ని ఛైర్మన్ డాక్టర్ ప్రతాప్ సి.రెడ్డి కూడా ధృవీకరించారు. దీంతో జయలలిత మరణంపై అనుమానాలు మరింతగా బలపడ్డాయి. 
 
ఈ నేపథ్యంలో ఆర్కే నగర్ ఉప ఎన్నికల పోలింగ్‌కు ఒక్క రోజు ముందు జయలలిత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ, జ్యూస్ తాగుతున్నట్టు ఉండే 20 సెకన్ల నిడివి కలిగిన వీడియోను దినకరన్ వర్గం రిలీజ్ చేసింది. ఈ వీడియోను చూసిన ప్రతి ఒక్కరికీ జయలలిత కోలుకున్నట్టుగానే అర్థమవుతోంది.

అయితే, ఈ సమయంలో వీడియోను విడుదల చేయడంలో అర్థమేంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అదేసమయంలో ఇలాంటి వీడియోలు మరిన్నింటిని రిలీజ్ చేస్తామని దినకరన్ వర్గం చెపుతోంది. మొత్తంమీద జయలలిత చనిపోయి ఒక యేడాది గడిచినా ఆమె మరణంపై సాగుతున్న చర్చ మాత్రం ఇప్పట్లో సద్దుమణిగేలా లేదు.