సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 15 డిశెంబరు 2022 (09:16 IST)

వరకట్న వేధింపుల కోసంలో కన్నడ నటికి రెండేళ్ల జైలు

abhinaya
తన సోదరుడిని భార్యను వేధించిన కేసులో కన్నడ నటి అభినయను కర్నాటక కోర్టు ముద్దాయిగా తేల్చింది. దీంతో ఆమెకు రెండేళ్ల జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. ఆమెపై నమోదైన ఆరోపణలు రుజువు కావడంతో ఆమెతో పాటు ఆమె సోదరులు, తల్లికి కూడా జైలుశిక్ష విధఇస్తూ కోర్టు తీర్పునిచ్చింది. ఈ కేసులో నటి తల్లికి గరిష్టంగా ఐదేళ్ల జైలుశిక్ష విధించడం గమనార్హం.
 
ఈ కేసు వివరాలను పరిశీలిస్తే, 1998లో శ్రీనివాస్ లక్ష్మీదేవిల వివాహం జరిగింది. ఆ సమయంలో లాంఛనాలతో పాటు రూ.80 నగదుతో పాటు 250 గ్రాముల బంగారం కూడా ఇచ్చారు. ఆ తర్వాత నుంచి లక్ష్మీదేవికి వరకట్న వేధింపులు మొదలయ్యాయి. అదనంగా మరో లక్ష రూపాయలు కట్నం తీసుకుని రావాలంటూ ఆమెను మానసికంగా వేధింపులకు గురిచేశారు. 
 
దీంతో ఆమెపై గత 2002లో చంద్రా లే అవుట్ పోలీస్ స్టేషన్‌‍లో ఫిర్యాదు చేశారు. పెళ్లయిన ఆరు నెలల నుంచి అత్తింటివారు తనను వేధించడం మొదలుపెట్టారని లక్ష్మీదేవి తన ఫిర్యాదులో పేర్కొంది. పైగా తనను ఎన్నో విధాలుగా అవమానించారని తెలిపారు. అప్పట్లో అభినయ హీరోయిన్ కావడంతో ఆమె ఇంటికి ఎవరూ వచ్చేవారు కాదని, వారికి సహకరించాలని తనపై ఒత్తిడి తీసుకొచ్చేవారని పేర్కొంది. 
 
అయితే, లక్ష్మీదేవి ఆరోపణలను బెంగుళూరు నగర జిల్లా కోర్టు తోసిపుచ్చగా ఆమె హైకోర్టును ఆశ్రయించారు. తాజాగా ఈ కేసును విచారించిన కోర్టు.. అభినయ, లక్ష్మీదేవి భర్త శ్రీనివాస్, అత్త జయమ్మ, చెలువరాజులను దోషులుగా నిర్ధారించి జైలుశిక్ష విధించింది. ఈ మేరకు న్యాయమూర్తి హెచ్.బి.ప్రభాకర శాస్త్రి తుది తీర్పును వెలువరించారు.