శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : సోమవారం, 18 మార్చి 2019 (10:46 IST)

ఆటోలో స్కూలుకు వెళ్లింది.. ఇంటికొచ్చేసరికి లేటయ్యిందని.. అడిగితే..?

తమిళనాడును పొల్లాచ్చి ఘటన కలకలం రేపిన నేపథ్యంలో.. కన్యాకుమారిలో పదో తరగతి అమ్మాయిలో అత్యాచారానికి పాల్పడిన ఓ దుండగుడు అభ్యంతరకరమైన ఫోటోలు, వీడియోలతో బాధితురాలిని బెదిరించాడు. వివరాల్లోకి వెళితే.. కన్యాకుమారి, తక్కల్, మయిలాడు ప్రాంతానికి చెందిన పదవ తరగతి విద్యార్థి హాల్ టిక్కెట్ తీసుకునేందుకు పాఠశాలకు వెళ్లింది. 
 
ఆటోలో స్కూలుకు వెళ్తున్న ఆ బాలిక ఆలస్యంగా ఇంటికొచ్చింది.  ఆలస్యమెందుకని తల్లిదండ్రులు బాలికను ప్రశ్నించడంతో ఆటో డ్రైవర్ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని, అభ్యంతరకరమైన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేశాడని వాపోయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇంకా పరారీలో వున్న ఆటో డ్రైవర్ శరవణన్‌ను అరెస్ట్ చేశారు.