గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 19 ఆగస్టు 2024 (22:29 IST)

విలేకరుల సమావేశం.. కుర్చీలోనే కుప్పకూలిన కాంగ్రెస్ నేత.. ఏమైందంటే? (video)

CK Ravichandran
CK Ravichandran
కరోనా ఒకవైపు, మంకీ ఫాక్స్ మరోవైపు జనాలను భయపెట్టాయి. ప్రస్తుతం గుండెపోటుతో మరణించే వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది. ఉన్నట్టుండి క్షణాల్లోనే గుండె ఆగిపోయి మరణించేవారి సంఖ్య పెరిగిపోతోంది. 
 
ఇప్పటికే ఇండోర్‌‌లో ఓ ఆటో డ్రైవర్ వైద్యుడు పరీక్షిస్తుండగానే గుండెపోటు కారణంగా ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే కర్ణాటక రాజధాని బెంగళూరులో సోమవారం ఓ విషాదకర ఘటన చోటుచేసుకుంది. 
 
విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కురుప సంఘం సంఘం అధ్యక్షుడు, కాంగ్రెస్ నాయకుడు సి.కె. రవిచంద్రన్ (63) గుండెపోటుతో మృతి చెందారు. రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు మద్దతుగా రవిచంద్రన్ విలేకరుల సమావేశం నిర్వహించారు. 
 
ఈ సమయంలో అకస్మాత్తుగా కుర్చీలో కూర్చుండగానే కుప్పకూలిపోయారు. అంతే గుండెపోటు ఆయన ప్రాణాలను బలిగొంది. కాంగ్రెస్ నేత సి.కె. రవిచంద్రన్ మృతితో కాంగ్రెస్ పార్టీతో పాటు స్థానిక వర్గాల్లో విషాద ఛాయలు అలముకున్నాయి. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేశారు.