శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 13 మే 2023 (15:07 IST)

కర్ణాటకలో కాంగ్రెస్ హవా.. ప్రధాని మోదీ ఓడిపోయారు..

Karnataka Election Result 2023
Karnataka Election Result 2023
కర్ణాటకను కాంగ్రెస్ సొంతం చేసుకుంది. మ్యాజిక్ ఫిగర్ 113 స్థానాలు గెలుచుకుని .. మరో 19 స్థానాల్లో ఆధిక్యంలో దూసుకుపోతోంది. మొత్తం 224 సీట్లకు గాను 113 సీట్లు గెలుచుకుంది. బీజేపీ 70 స్థానాలు దాటకపోగా, జేడీఎస్ సైతం పాతిక స్థానాలకు చేరలేకపోయింది. 
 
ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చిన కన్నడ ప్రజలకు కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ కృతజ్ఞతలు తెలిపారు. అలాగే సిది సెక్యులర్ పార్టీ విజయమని కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య ట్వీట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ చాటడంపై ఆ పార్టీ కర్ణాటక అధ్యక్షుడు డీకే శివకుమార్ స్పందించారు. 
 
ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చారు. వారికి ధన్యవాదాలంటూ డీకే తెలిపారు. కర్ణాటకలో ఎన్నికల ఫలితాలను బట్టి కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ప్రధాని నరేంద్ర మోదీ ఓడిపోయినట్లు తెలుస్తోందని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ వ్యాఖ్యానించారు.