శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 29 మార్చి 2023 (16:28 IST)

కర్ణాటకలో ఎన్నికల నగారా: మేం అధికారంలోకి వస్తే గ్యాస్ సిలిండర్‌పై 50 శాతం సబ్సిడీ!

LPG Cylinder
కర్ణాటకలో ఎన్నికల నగారా మోగిన నేపథ్యంలో కర్ణాటక మాజీ సీఎం హెచ్డీ కుమార స్వామి ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పారు. తమ సర్కారు అధికారంలోకి వస్తే గ్యాస్ సిలిండర్‌పై 50 శాతం సబ్సిడీ అందిస్తామని వాగ్ధానం చేశారు. ఉచిత గ్యాస్ ఇస్తామని వాగ్ధానం చేసిన కేంద్రం అధికారంలోకి వచ్చాక ఉజ్వల పథకాన్ని అమలు చేస్తోంది. 
 
బీజేపీ వాగ్ధానాలు నమ్మి ఓట్లు వేసిన మహిళలకు కేంద్రం షాకిచ్చిందని కుమార స్వామి గుర్తు చేశారు. సిలిండర్ ధర రూ.1000లకుపైగా పెరగడంతో పేదలు కష్టాలుపడుతున్నారు. మా పార్టీ అధికారంలోకి వస్తే వంటగ్యాస్‌పై రాయితీ మాత్రమేకాకుండా ఏడాదికి ఐదు ఎల్పీజీ గ్యాస్‌ సిలిండర్లు ఉచితంగా పంపిణీ చేశామని చెప్పారు. 
 
ఆటో డ్రైవర్లకు నెలకు రెండు వేల చొప్పిన ఆర్థిక సాయం అందిస్తామని.. అంగన్‌వాడీ కార్యకర్తలను పర్మినెంట్ చేస్తామని కుమారస్వామి తన ప్రసంగంలో చెప్పారు. కర్ణాటకలోని 224 స్థానాలకు వచ్చేనెలలో (ఏప్రిల్‌) అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.