శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ప్రీతి
Last Updated : బుధవారం, 27 ఫిబ్రవరి 2019 (11:12 IST)

వెధవలకు జవాబు చెప్పే సమయం లేదు.. తనీష్‌కి షాకిచ్చిన కౌషల్

ఒకప్పుడు పాపులారిటితో వార్తలలో నిలిచిన కౌషల్ ఇప్పుడు వివాదాలతో నిలుస్తున్నారు. అతనిపై కౌషల్ ఆర్మీ చేసిన కమెంట్స్, ఆరోపణలతో కౌషల్ పాపులారిటీకి దెబ్బ పడింది. వీరు ఎందుకిలా చేస్తున్నారనే దానిపై సమాధానం ఇవ్వడానికి ఇష్టపడట్లేదంట. అంతేకాకుండా కౌషల్‌ను వీరంతా ఎందుకు టార్గెట్ చేయడం స్టార్ట్ చేస్తున్నారనే దానికి సమాధానం లేదు.
 
ఈ నేపథ్యంలో ఆయనపై వచ్చిన ఆరోపణలు, విమర్శలకు ప్రతిస్పందిస్తూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. అందులో నన్ను విమర్శించడం వలన వారికి సంతృప్తి దొరుకుతుందంటే అలాగే కానివ్వండి. అటువంటి వెధవలకు సమాధానం చెప్పే అవసరం నాకు లేదు, సమయం అంతకన్నా లేదు. నేను ఎలా ఉన్నానో అలాగే ఉంటాను, ఎప్పుడూ మారను అంటూ ట్వీట్ చేసారు. అయితే ట్వీట్‌తో పాటుగా తనీష్‌తో పాటు కొందరు వ్యక్తులు తీసుకున్న ఫోటోను షేర్ చేసాడు. అయితే వారంతా ఎవరు, ఈ ఫోటో ఎందుకు పోస్ట్ చేసాడనేది సమాధానం లేని ప్రశ్నలే. మొత్తానికి తనీష్‌ను టార్గెట్ చేసాడన్నమాట.