1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : శుక్రవారం, 4 సెప్టెంబరు 2015 (14:42 IST)

కేసీఆర్‌కు కేంద్ర బలగాల భద్రతను తొలగించిన హోంశాఖ

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావుతో పాటు 30 మంది వీఐపీలకు కేంద్ర బలాగల భద్రతను కేంద్ర హోంశాఖ తొలగించింది. వీరికి ఉన్న వ్యక్తిగత ప్రమాదం, ఇతర పరిణామాలను బేరీజు వేసిన తర్వాత వీరికి కల్పిస్తున్న భద్రతను తొలగించారు. ఈ మేరకు కేంద్ర హోంశాఖ శుక్రవారం ఓ అధికారిక ప్రకటనను వెలువరించింది. 
 
కేంద్ర బలగాల భద్రతను తొలగించిన వారిలో కేంద్ర మాజీ హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే కుటుంబంలోని 8 మంది సభ్యుల, మాజీ లోక్‌సభ స్పీకర్ మీరా కుమార్, టెలికం శాఖ మాజీ మంత్రి, 2జీ స్కామ్ నిందితుడు ఏ. రాజా, జమ్మూకాశ్మీర్ మాజీ లెఫ్టినెంట్ జనరల్ ఎస్.కే. సిన్హా, ఎన్‌హెచ్ఆర్సీ ఛైర్ పర్సన్ కేజీ బాలకృష్ణన్, కేరళ గవర్నర్, మాజీ సీజే పి సదాశివం, ఉత్తరాఖండ్ గవర్నర్ కేకే పాల్, కేంద్ర మాజీ మంత్రులు సుబోద్ కాంత్ సహాయ్, వీ నారాయణ స్వామి, జితిన్ ప్రసాద్, పారిశ్రామికవేత్త నవీన్ జిందాల్ తదితరులు ఉన్నారు.