సోమవారం, 6 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 17 మే 2024 (18:48 IST)

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

Vijay Kanishka, Suriya, KS ravikumar and others
Vijay Kanishka, Suriya, KS ravikumar and others
తమిళ డైరెక్టర్ విక్రమన్ కొడుకు విజయ్ కనిష్క హీరోగా సముద్రఖని, శరత్ కుమార్, గౌతమ్ వాసుదేవ మీనన్ ముఖ్యపాత్రలో నటించిన సినిమా హిట్ లిస్ట్. సూర్య కతిర్ కాకల్లార్, కే. కార్తికేయన్ దర్శకత్వంలో ఆర్. కె. సెల్యులాయిడ్స్ పై డైరెక్టర్ కె. ఎస్. రవికుమార్ నిర్మిస్తున్న సినిమా. గతంలో ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్లు సినిమా పైన అంచనాలను పెంచగా. నేడు ఈ సినిమాకి సంబంధించిన టీజర్ వెర్సటైల్ హీరో సూర్య చేతుల మీదగా లాంచ్ చేశారు.
 
యాక్షన్, సస్పెన్స్, క్రైమ్ జోనర్ లో వస్తున్న ఈ సినిమా టీజర్ చాలా బాగుంది. ప్రెసెంట్ ఆడియన్స్ ని ఎక్కువగా క్రైమ్, సస్పెన్స్ జానర్ మూవీస్ అట్రాక్ట్ చేస్తున్నాయి ఇది కూడా ఆ జానర్ లోకి రావడం అదే విధంగా టీజర్ సినిమా పైన అంచనాలను పెంచేస్తోంది.
 
టీజర్ చూసిన అనంతరం హీరో సూర్య మాట్లాడుతూ : టీజర్ చాలా బాగుంది సినిమా ఇంకా బాగుంటుందని ఆశిస్తున్నాను. ఖచ్చితంగా ఈ సినిమా విజయ్ కనిష్క కి ఈ టీం కి మంచి సక్సెస్ ఇవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.
 
నటీనటులు : విజయ్ కనిష్క, శరత్ కుమార్, సముద్రఖని, గౌతమ్ వాసుదేవ మీనన్, మునిష్కాంత్ కింగ్స్ లే, సితార, స్మృతి వెంకట్, రామచంద్ర రాజు (కే జి ఎఫ్ గరుడ), రామచంద్రన్, ఐశ్వర్య దత్త, అభి నక్షత్రం.