బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 5 ఏప్రియల్ 2023 (16:18 IST)

25 నుంచి కేదార్‌నాథ్ ధార్ యాత్ర ప్రారంభం

kedarnath yatra
కేదార్‌నాథ్ యాత్రకు వెళ్లే భక్తులకు ఆలయ అధికారులు శుభవార్త చెప్పారు. కేదార్నాథ్ యాత్ర ఈ నెల 25వ తేదీన ప్రారంభమవుతుందని వారు వెల్లడించారు. ఈ యాత్రలో పాల్గొనదలచిన భక్తులు కాలి నడకతో పాటు హెలికాఫ్టర్ ద్వారా కేదార్నాథ్ చేరుకోవచ్చని వారు తెలిపారు. కేదార్నాథ్‌ ధామ్‌కు హెలికాఫ్టరులో ప్రయాణించే యాత్రికుల సౌకర్యార్థం ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ) ఆన్‌లైన్ బుకింగ్ సదుపాయాన్ని కూడా కల్పించింది. ఈ పోర్టల్‌ను కూడా ఈ నెల 25వ తేదీ నుంచి అందుబాటులోకి రానుంది.
 
మరోవైపు. వచ్చే చార్‌ధామ్ యాత్ర కోసం ఇప్పటికే 6.35 లక్షల మంది భక్తులు దరఖాస్తు చేసుకున్నారని ఉత్తరాఖండ్ పర్యాటక అభివృద్ధి మండలి గత నెలలోనే వెల్లడించింది. వీరిలో కేదార్నాథ్ ధామ్‌కు 2.41 లక్షలు, బద్రీనాథ్‌ ధామ్‌కు 2.01 లక్షలు, యమునోత్రికి 95,107, గంగోత్రికి 96449 మంది భక్తులు తమ పేర్లను నమోదు చేసుకున్నారని తెలిపారు. ఈ యాత్రలో ఆరోగ్య పరీక్షల కోసం ప్రత్యేకంగా ఆరోగ్య బృందాలను ఏర్పాటు చేస్తామని, ఇవి భక్తులకు సౌకర్యవంతంగా ఉంటాయని తెలిపారు.