ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 14 జులై 2021 (07:35 IST)

రాజస్థాన్‌లో కలియుగ కుంభకర్ణుడు!

కుంభకర్ణుడు అనే రాక్షసుడు ఏడాదిలో ఏకబిగిన ఆర్నెల్లు నిద్రపోతాడనేది పురాణగాథ. సుదీర్ఘ నిద్రలో కుంభకర్ణుడినే తలదన్నెవాడొకడు రాజస్థాన్‌లో ఉన్నాడు.

అతడు నెలల లో వరుసగా 25 రోజులు నిద్రలోనే గడుపుతాడు. అంటే ఏడాదిలో 300 రోజులు గుర్రుపెడతాడన్నమాట. సంవత్సరంలో ఓ యాభై రోజులు మాత్ర మే స్పృహలో ఉంటాడు. నిద్రాదేవి ఇంతలా ఆవహించిన ఆయన 42 ఏళ్ల పుర్కారామ్‌! ఊరు నాగౌర్‌.

ఈ నిద్ర ఆయన కోరుకున్నది కాదు. ‘ఆక్సిస్‌ హైపర్‌ సోమ్నియా’ అనే స్లీపింగ్‌ డిజార్డర్‌తో ఆయన బాధపడుతున్నారు. 25 రోజుల తర్వాత నిద్రలేచినప్పుడే ఆయనకు స్నానం చేయించి భోజనం పెడుతున్నారు కుటుంబసభ్యులు!

23 ఏళ్ల వయసులో ఆయన ఈ అరుదైన వ్యాధి బారినపడ్డారు. తొలుత రోజులో 15 గంటలు నిద్రపోయేవాడు. తర్వాత ఆ సమయం పెరుగుతూ పెరుగుతూ నెలలో 25 రోజుల పాటు నిద్రావస్థలోనే గడిపేస్థాయికి చేరుకున్నారు. అన్నట్టు.. పుర్కారామ్‌కు పెళ్లయింది. తన భర్త త్వరలోనే కోలుకుంటాడన్న ఆశాభావాన్ని భార్య వ్యక్తం చేశారు.