శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 13 జులై 2021 (18:18 IST)

జనరేటర్ పేలి ఆరుగురు మృతి: మహారాష్ట్రలో ఘోరం

మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లాలో ఘోరం ప్రమాదం జరిగింది. దుర్గాపూర్‌లో సోమవారం అర్ధరాత్రి జనరేటర్ పేలడంతో ఒకే కుటుంబంలో ఆరుగురు మృతి చెందారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశామని పోలీసులు వెల్లడించారు. దుర్గాపూర్ గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.
 
వర్షాలు కురుస్తుండటంతో విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. దీంతో ఇంట్లో ఉన్న జనరేటర్‌ను ఆన్ చేసి ఆ కుటుంబం నిద్రలోకి జారుకుంది. ఈ క్రమంలో జనరేటర్ బంద్ చేయకపోవడంతో పేలిపోయింది. ఆ ఇల్లు మొత్తం దట్టమైన పొగ (కార్బ‌న్ డై ఆక్సైడ్) వ్యాపించింది. 
 
దీంతో ఊపిరాడక కుటుంబంలోని అందరూ ప్రాణాలు కోల్పోయారు. చిన్న పొరపాటు కారణంగా ఒకే ఇంట్లో ఆరుగురు చనిపోయిన సంఘటన మ‌హారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లాలో చోటుచేసుకుంది. మృతుల్లో ముగ్గురు మైన‌ర్లు ఉన్నారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.