సెల్ఫీ తీసుకుంటుండగా పిడుగుపడి 11 మంది మృతి
రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్ ప్యాలెస్ టవర్ వద్ద విషాదం చోటుచేసుకుంది. పిడుగుపాటుకు 11 మంది మత్యువాతపడ్డారు. సెల్ఫీ తీసుకుంటుండగా ఈ పిడుగు పడింది. దీంతో 11 మంది చనిపోయారు.
కరోనా లాక్డౌన్ ఆంక్షలు సడలించడంతో జైపూర్‌లోని అమేర్ ప్యాలెస్ వద్ద ఉన్న వాచ్ టవర్‌కు పర్యాటకుల తాకిడి ఎక్కువైంది. ఆదివారం రాత్రి 7 గంటల సమయంలో వాచ్ టవర్ వద్ద భారీ వర్షం కురిసింది. ఈ క్రమంలో ఆ టవర్ వద్ద సెల్ఫీలు తీసుకునేందుకు పర్యాటకులు ఎగబడ్డారు.
ఆ సమయంలోనే భారీ పిడుగు పడింది. దీంతో అక్కడికక్కడే 11 మంది పర్యాటకులు మృతి చెందగా, మరో 35 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులు పక్కనున్న లోయలో పడిపోయారు.
వారందరినీ రెస్క్యూ టీం బయటకు తీసుకొచ్చి.. సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.