సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 12 జులై 2021 (12:02 IST)

సెల్ఫీలు తీసుకుంటుండగా పిడుగులు.. 11మంది మృతి

సెల్ఫీలు తీసుకుంటుండగా పిడుగులు పడటంతో 11 మంది మృతి చెందిన ఘటన రాజస్థాన్‌లో జరిగింది. ఈ ఘటనలో మరికొందరికి గాయాలైనట్లు అధికారులు తెలిపారు. ఆదివారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. 
 
జైపూర్‌లోని 12వ శతాబ్దానికి చెందిన అమర్‌ ప్యాలెస్‌ను సందర్శించేందుకు 27 మంది పర్యాటకులు వెళ్లారు. అదే సమయంలో ఒక్కసారిగా పిడుగులు పడటంతో 11 మంది మరణించారు. భయాందోళనలతో టవర్‌పై నుండి దూకడంతో మరికొంతమందికి గాయాలైనట్లు అధికారులు తెలిపారు. కాగా, ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా జరిగిన పిడుగుల ఘటనల్లో తొమ్మిది మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. 
 
బరాన్‌, జల్వార్‌లలో ఒక్కొక్కరు చొప్పున మరణించగా, కోటాలో నలుగురు, ధోల్‌పూర్‌ జిల్లాలో ముగ్గురు మరణించారు. మృతిచెందినవారిలో ఏడుగురు చిన్నారులు ఉన్నట్లు వివరించారు. కాగా, ఈ ఘటనల్లో మరణించిన వారి కుటుంబాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్‌గెహ్లాట్‌ రూ. 5 లక్షల నష్టపరిహారం ప్రకటించారు. ఈ ఘటనలపై ప్రధాని మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.