సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By మోహన్
Last Updated : మంగళవారం, 2 ఏప్రియల్ 2019 (19:16 IST)

స్టెప్పులతో ఇరగదీసిన మహిళా పోలీసులు..

సాధారణంగా పోలీస్ డ్యూటీ అంటేనే కత్తి మీద సాము లాంటిది. పోలీసులు విధుల్లో నిత్యం బిజీగా ఉంటారు. లా అండ్ ఆర్డర్ సంరక్షణలో క్షణం తీరిక లేకుండా గడుపుతారు. ఎప్పుడూ క్రిమినల్స్, కేసులతో టెన్షన్‌గా ఉంటారు. వీరిలో మహిళా పోలీసుల గురించి వేరే చెప్పనక్కర్లేదు.


అలాంటి ఖాకీలు కాసేపు రిలాక్స్ అయ్యారు. తమలో దాగి ఉన్న మరో టాలెంట్‌ని ప్రదర్శించారు. ఢిల్లీ పోలీసులు స్టేజీపై స్టెప్పులతో ఇరగదీశారు. హర్యాన్వీ సాంగ్‌కు ఉల్లాసంగా, ఉత్సాహంగా చిందులేశారు.
 
ఢిల్లీలో సౌత్ వెస్ట్ డిస్ట్రిక్ పోలీసుల ఆధ్వర్యంలో సునో సహేలీ పేరుతో ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో పాల్గొన్న మహిళా పోలీసులు స్టేజీపై స్టేప్పులతో అందరినీ అలరించారు.

సహచరుల జోష్ చూసి ఐపీఎస్ ఆఫీసర్ కూడా ఆగలేకపోయారు. ఆమె కూడా వారితో పాటు స్టెప్పులు వేశారు. సరదాగా డ్యాన్స్ చేస్తూ సహచరుల్లో జోష్ నింపిన మహిళా పోలీసుల డ్యాన్స్ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.