మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Modified: బుధవారం, 17 ఏప్రియల్ 2019 (15:50 IST)

ఉత్తరాదిని వణికిస్తున్న పిడుగులు... ఇసుక తుఫాన్: 30 మంది మృతి

దక్షిణాదిన ఎండలు దంచేస్తున్నాయి. కానీ ఉత్తరాది రాష్ట్రాలను మాత్రం ఇసుక తుఫానులు, పిడుగులతో కూడిన వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. గత నాలుగైదు రోజుల వ్యవధిలోనే ఉత్తరాది రాష్ట్రాల్లో వీటి కారణంగా 30 మందికి పైగా మృత్యువాత పడ్డారు. గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో ఇసుక తుఫాన్, పిడుగులతో వర్షాలు ఎక్కువగా వున్నాయి. 
 
నిన్న మధ్యప్రదేశ్ రాష్ట్రంలో పిడుగులతో కూడిన వర్షం కారణంగా ఇండోర్ తదితర ప్రాంతాల్లో 16 మంది మృత్యువాత పడ్డారు. ఇక గుజరాత్, రాజస్థాన్‌ల్లో కూడా అకాల వర్షాలు కురుస్తున్నాయి. దీనితో అధికారులు ప్రజలను హెచ్చరిస్తున్నారు. మేఘాలు దట్టంగా పట్టి వర్షం కురిసే పరిస్థితి వున్నప్పుడు వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచిస్తున్నారు.