శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By
Last Updated : శనివారం, 6 ఏప్రియల్ 2019 (13:08 IST)

రేవంత్ రెడ్డి వినూత్న ప్రచారం.. రైళ్లల్లో డ్యాన్సులు.. టీడీపీ నేతలు కూడా?

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీలో వున్న రేవంత్ రెడ్డి వినూత్న రీతిలో ప్రచారం చేస్తున్నారు. తెలంగాణ పరిధిలోని మల్కాజ్ గిరి నియోజకవర్గం నుంచి రేవంత్ రెడ్డి ఎన్నికల బరిలోకి దిగిన సంగతి తెలిసింగే. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో వినూత్న శైలిలో దూసుకెళుతున్నారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు ఆయన ఎంచుకున్న విభిన్న మార్గం ప్రస్తుతం అందరినీ ఆకట్టుకుంటోంది. 
 
రేవంత్ రెడ్డి మాస్క్‌లు ధరించిన కొందరు యువకులు మెట్రో రైల్లో నృత్యాలు చేశారు. యువనేతకు ఓటేయాలని అభ్యర్థించారు. వివిధ కూడళ్లలోనూ వారు మాబ్ డ్యాన్స్ చేస్తూ స్థానికులను అలరించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
 
అలాగే రేవంత్ రెడ్డి కోసం టీడీపీ నేతలు కూడా ప్రచారం చేస్తున్నారు. మల్కాజ్ గిరిలో ఇంటింటికి తిరిగి రేవంత్ రెడ్డికి ఓటేయాలని ఓటర్లను కోరుతున్నారు. టీడీపీ-కాంగ్రెస్ పార్టీలను ఓటర్లు గెలిపించాలని కోరుతున్నారు. ప్రచారంలో భాగంగా రాజు గౌడ్, మల్లేష్ గౌడ్, మునీల్ నాయక్, అలీమ్‌లతో పాటు టీడీపే నేతలు రేవంత్ రెడ్డికి మద్దతుగా ఓటేయాలని విజ్ఞప్తి చేసారు.