ఏపీలో ఎవరు గెలిస్తే నాకెందుకు? రేవంత్ రెడ్డి ప్రశ్న

Revanth
Last Modified సోమవారం, 25 మార్చి 2019 (14:50 IST)
రేవంత్ రెడ్డికి రాజకీయాలంటే బోర్ కొట్టినట్లుంది. అందుకేనేమో ఏప్రిల్ 11న జరుగనున్న ఎన్నికల్లో ఏపీలో ఏ పార్టీ విజయం సాధిస్తుందని అడిగితే... ఏపీలో ఎవరు గెలిస్తే నాకెందుకు? పక్క రాష్ట్రానికి చెందిన రాజకీయాలను మాట్లాడాల్సిన అవసరంలేదు, పైగా అసలు తనకు ఆ ఆసక్తి కూడా లేదంటూ చెప్పారు. ఇదిలావుంటే ఏపీ అసెంబ్లీ ఎన్నికల వేళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణ సీఎం కేసీఆర్ పైన విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు.

జగన్ మోహన్ రెడ్డిని అడ్డం పెట్టుకుని కేసీఆర్ కుట్రలు చేస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. అసలు ఏపీ ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డిపైన చేస్తున్న విమర్శల కంటే కేసీఆర్ పైన చేస్తున్న విమర్శలు ఎక్కువగా వుంటున్నాయి. ఈ నేపధ్యంలో ఏపీలో బాబు వర్సెస్ కేసీఆర్ అన్నట్లుగా తయారైంది. మరోవైపు జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ఉత్తరాంధ్రకు సంబంధించిన అన్ని సీట్లను కైవసం చేసుకోవాలన్న ఆకృతతో వున్నారు.



దీనిపై మరింత చదవండి :