సర్పంచ్ ఎన్నికల్లో ఓడిన అభ్యర్థిని సన్మానించిన గ్రామస్థులు
హర్యానా రాష్ట్రంలో తాజాగా జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో ఓటమిపాలైన అభ్యర్థిని స్థానికులు ఘనంగా సన్మానించారు. రూ.12 లక్షల నగదుతో పాటు ఓ స్విఫ్ట్ డిజైర్ కారును సైతం బహుకరించారు. అదేవిధంగా మరో గ్రామంలో గెలిచిన అభ్యర్థిని కూడా గ్రామస్థులు అదిరిపోయే విధంగా సన్మానించారు.
హర్యానా రాష్ట్రంలోని ఫతేహాబాద్‌లోని నథోడి అనే గ్రామానికి తాజాగ పంచాయతీ ఎన్నికలు జరిగాయి. మొత్తం 4416 ఓట్లకుగాను, వీటిలో సుందర్ అనే అభ్యర్థికి 2200 ఓట్లు, నరేందర్ అనే అభ్యర్థికి 2201 ఓట్లు వచ్చాయి. దీంతో సుందర్ ఒకే ఒక్క ఓటు తేడాతో ఓటమిపాలయ్యాడు.
అయితే, ఓడిపోయిన అభ్యర్థికి గ్రామస్థులంతా కలిసి అదిరిపోయేలా సన్మానించారు. సుందర్‌కు రూ.11,11,000 నగదుతో పాటు ఓ స్విఫ్ట్ డిజైర్ కారును బహుకరిచారు. అలాగే, మరో పక్క గ్రామంలో గెలిచిన అభ్యర్థిని కూడా రూ.11,500 నోట్ల గజమాలతో ఘనంగా సత్కరించారు.