శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : సోమవారం, 4 మార్చి 2019 (12:19 IST)

ఏకే-203 రైఫిల్.. మేడిన్ అమేథీ : రష్యా సాయంతో తయారీ

ప్రపంచంలోనే అత్యాధునిక రైఫిల్స్‌ను భారత్‌లో తయారు చేయనున్నారు. అదీకూడా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రాతినిథ్యం వహిస్తున్న అమేథీలో ఈ రైఫిల్స్‌ను రష్యా సహకారంతో వీటిని తయారు చేయనున్నారు. ఇందుకోసం అధునాత ఆయుధ తయారీ కర్మాగారాన్ని నిర్మించనున్నారు. 
 
ఈ కర్మాగారానికి ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం శంఖుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారత సైనిక దళాలు అమేథీలో తయారైన రైఫిల్స్‌ను వినియోగించనున్నాయి. ఈ పనులు 9 ఏళ్ల క్రితమే ప్రారంభించాల్సి ఉంది. కానీ, కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రారంభించలేదు. మేడ్ ఇన్‌ అమేథీ నినాదాన్ని మేము నిజం చేశాము. రష్యా కంపెనీ ఇందులో భాగస్వామ్యం పంచుకునేందుకు సహకరించిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌కు ధన్యవాదాలు చెబుతున్నట్టు ఆయన పేర్కొన్నారు. 
 
కాగా, కొంత మంది ప్ర‌పంచంలో తిరుగుతూ చెబుతుంటారు..ఇది ఉజ్జ‌యినిలో త‌యారైంద‌ని, జైపూర్‌లో త‌యారైంద‌ని, జైస్మ‌లేర్‌లో త‌యారైందంటూ మాటలు చెబుతుంటారు. కానీ వాళ్ల భాష అలాగే ఉండిపోతుంది. ఇక్క‌డ మోడీ ఉన్నాడు. అమేథీలో ఏకే-203 రైఫిల్ వ‌చ్చింది. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేసి గెలిచిన వారి కంటే భాజపా నేత, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీయే ఈ ప్రాంతం కోసం ఎక్కువగా పనిచేశారు. మేం ఇక్క‌డ ఓడిపోవ‌చ్చు కానీ ప్ర‌జ‌ల హృద‌యాలను గెల్చుకున్న‌ట్లు ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.