సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 6 జూన్ 2022 (15:14 IST)

మధ్యప్రదేశ్‌లో విషాదకర ఘటన: దంపతులపై ఎలుగుబంటి దాడి

bears
మధ్యప్రదేశ్ అడవుల్లో విషాదకర సంఘటన జరిగింది. ఆదివారం తెల్లవారుజామున దైవ దర్శనానికి వెళ్ళిన దంపతులపై ఒక ఎలుగుబంటి దాడి చేసింది. దీంతో ఆ దంపతులు ప్రాణాలు కోల్పోయారు. అంతేగాకుండా వారి శవాలను ఎలుగుబంటి పీక్కుతింటుంది. 
 
వెంటనే దాన్ని ఎలుగుబంటిని తరిమికొట్టేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో స్థానికులు, అటవీ అధికారులకు సమాచారం అందించారు. దాదాపు ఐదు గంటపాటు శ్రమించి ఎట్టకేలకు ఆ ఎలుగుబంటిని పట్టుకున్నారు. ఈ ఘటనతో పన్నా జిల్లాలోని కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలోని జరిగింది.
 
వివరాల్లోకి వెళితే.. రాణిగంజ్ ప్రాంతానికి చెందిన ముఖేష్ రాయ్ (50), అతని భార్య గుడియా (45 ) పన్నానగరం అటవీ ప్రాంతంలో ఉన్న ఖర్మాయి మాత ఆలయాన్ని దర్శనం చేసుకోవడానికి వెళ్లారు. అప్పుడు గుడి దగ్గరగా ఉన్నప్పుడు ఆ దంపతులపై ఎలుగుబంటి దాడి చేసింది.  దీంతో దంపతులు మృతి చెందారు.