ఆదివారం, 13 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 29 మే 2022 (17:06 IST)

ఎంపీలో పానీపూరి ఆరగించి 97 మంది చిన్నారులకు అస్వస్థత

fire panipuri
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో పానీపూరి ఆరగించి 97మంది చిన్నారులు తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. ఈ పానీపూరీలు ఆరగించిన తర్వాత తీవ్రమైన కడుపునొప్పి, వాంతులతో బాధపడుతున్నారు. దీంతో వీరందరినీ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 
 
రాష్ట్రంలోని సింగర్ పూర్ జాతరలో ఈ ఘటన జరిగింది. ఈ ప్రాంతం జిల్లా కేంద్రానికి 38 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీనిపై జిల్లా ఎస్పీ స్పందిస్తూ, ఈ జాతరకు వచ్చిన చిన్నారులు కొంతమంది చిరుతిండిగా పానీపూరీ ఆరగించారని వారంతా రాత్రి 7.30 గంటల సమయంలో వాంతులు విరేచనాలు చేసుకోవడంతో తీవ్ర అస్వస్థతకు లోనయ్యారని తెలిపారు. ఫుడ్ పాయిజినింగ్ కారణంగానే ఇది జరిగిందని వారిని పరీక్షించిన వైద్యులు వెల్లడించారు.