ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 14 డిశెంబరు 2021 (13:42 IST)

బలవంతంగా శృంగారం.. భర్త మర్మాంగాన్ని కోసేసిన భార్య

శృంగారంలో బలవంతంగా పాల్గొనాలని భర్త వేధించడంతో భార్య అతని మర్మాంగాన్ని కోసిపారేసింది. విస్మయానికి గురిచేసే ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని టీకంగఢ్‌ జిల్లాలో చోటుచేసుకుంది. వారం రోజుల కిందట జరిగిన ఈ ఘటన బాధితుడి ఫిర్యాదుతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 
 
వివరాల్లోకి వెళితే.. డిసెంబరు 7న టీకంగఢ్‌ పట్టణం రామ్‌నగర్‌ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుందని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 26 ఏళ్ల బాధితుడు ఆదివారం ఫిర్యాదు చేసినట్లు జాతర పోలీస్‌స్టేషన్‌ ఇంఛార్జ్ తివేంద్ర త్రివేదీ తెలిపారు. 
 
24 ఏళ్ల యువతి తన భర్త బలవంతపెట్టాడని మర్మంగాన్ని కోసేసిందని త్రివేదీ చెప్పారు.  ఈ జంటకు 2019లో వివాహం జరిగిందని, అనంతరం కొన్ని స్పర్ధలతో విడిగా ఉన్నారని తెలిపారు. పెద్దల జోక్యంతో ఇటీవలే కలిశారని, అంతలోనే ఇది జరిగిందని పోలీసులు తెలిపారు.
 
డిసెంబరు 7న ఘటన జరిగినా.. శస్త్రచికిత్స చేయించుకోవడంతోనే బాధితుడు ఆలస్యంగా ఫిర్యాదు చేశాడు.. మారణాయుధంతో దాడిచేయడంతో ఐపీసీ సెక్షన్‌ 324 కింద కేసు నమోదు చేశారు.