శనివారం, 7 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 22 ఆగస్టు 2022 (13:13 IST)

దర్గా దర్శనానికి వెళ్లి తిరిగివస్తూ... కుటుంబమంతా మృతి

deadbody
మహారాష్ట్రలోని నాందేడ్‌లో దారుణం జరిగింది. దర్గా దర్శనానికి వెళ్లి ఇంటికి తిరిగి వెళుతూ ఓ కుటుంబమంతా ప్రమాదవశాత్తు చెరువులో పడి మృత్యువాతపడ్డారు. ప్రమాదవశాత్తు చెరువులో పడిన తమ వ్యక్తిని రక్షించేందుకు మిగిలివారు కూడా చెరువులోకి ప్రాణాలు కోల్పోయారు. హృదయాన్ని కదిలించే ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే, 
 
ఓ కుటుంబం కారులో మహారాష్ట్రలోని నాందేడ్‌ వద్ద ఉన్న ఓ దర్గా దర్శనానికి వెళ్లింది. తమ ఇష్టదైవాన్ని దర్శనం చేసుకుని తిరిగి వస్తుండగా, మార్గమధ్యంలో భోజనం చేసేందుకు ఆగారు. కంధర్ చెరువు వద్ద వాహనాన్ని నిలిపారు. ఈ క్రమంలో టిఫిన్ బాక్సును కడిగేందుకు ఒకరు చెరువు వద్దకు వెళ్లారు. ప్రమాదవశాత్తు అందులో మునిగిపోయారు. వెంటనే అప్రమత్తమైన మిగతా కుటుంబ సభ్యులు నీటిలో పడిపోయిన వ్యక్తిని కాపాడేందుకు వెళ్లారు. తొలుత ఇద్దరు వ్యక్తులు నీటిలో దూకారు. 
 
వీరంతా మునిగిపోవడంతో చూసి ఒడ్డున ఉన్న వారిలో ఇద్దరు చెరువులోకి దూకారు. వారు కూడా నీటిలో మునిగిపోవడంతో మరో మరో వ్యక్తి అలా మొత్తం ఐదుగురు చెరువులోకి దిగారు. వారంతా నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదం కలిగించింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.