బుధవారం, 1 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 15 ఫిబ్రవరి 2024 (17:21 IST)

తిరుపతి జూ పార్కులో సింహం దాడి.. వ్యక్తి మృతి.. ఎన్‌క్లోజర్‌లోకి ఎలా?

lion
తిరుపతి జూ పార్కులో సింహం దాడికి గురై ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. లయన్ ఎన్‌క్లోజర్‌లోకి వెళ్లిన 38 ఏళ్ల సందర్శకుడిపై సింహం దాడి చేసింది. ఈ ఘటన ప్రమాదవశాత్తూ జరిగిందా.. లేకుంటే మృతుడు లయన్ ఎన్ క్లోజర్‌లోకి వెళ్లాడా అనేది తెలియాల్సి వుంది. 
 
ఈ ఘటనపై విచారణ జరుగుతోంది. మృతుడు రాజస్థాన్‌కు చెందిన ప్రహ్లాద్ గుర్జార్ అని గుర్తించారు. ఇప్పటివరకు సింహం దాడి చేసిన వ్యక్తి మృతదేహం లభ్యం కాలేదు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. 
 
బాధితుడు సింహం ఉన్న ఎన్‌క్లోజర్‌లోకి దూకినట్లు తెలుస్తోంది. దీంతో సింహం అతనిపై దాడి చేయగా.. ఈ ఘటనలో అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. చంపేసిన తర్వాత సింహం నోట కరుచుకుని వెళ్లినట్లుగా తెలిసింది.